మధిరలో విజయవంతమైన ఎం.పి. నామా పర్యటన.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Print
Email

మధిరలో విజయవంతమైన ఎం.పి. నామా పర్యటన. T.R.S.లోక్ సభా పక్ష నేత,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు ఈరోజు మధిర మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

మధిర పర్యటనకు విచ్చేసిన నామాకు టి.ఆర్.యస్.జిల్లా నాయకులు చెరుకూరినాగార్జున, మొండితోకసుధాకరరావు, మాదలరామారావు, చిరుమామిళ్ళ  రాము,అయితం వెంకటేశ్వర రావులుఎం.పి.నామాకు” పుష్ప గుచ్చ్చాలతో ముందుగా మధిరలో ఘన స్వాగతం పలికినారు.

అనంతరం ఎం.పి.నామా నాగేశ్వర రావు మధిరలో పలు ప్రారంభోత్సవాలు, శుభకార్యాలు,పరామర్శ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మధిర మండల పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలిసి మధిర మార్కెట్ యార్డ్ లో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎం.పి.నామా నాగేశ్వరరావు ప్రారంభించారు.

అనంతరం మండలం లోని మడుపల్లి,రాయపట్నం గ్రామాలలోని రైతు వేదిక భవనాలను,రాయపట్నం గ్రామంలో సి.సి.రోడ్డును ప్రారంభించారు.

ఇల్లూరు గ్రామం నందు కమ్యూనిటీ హాలు,సి.సి.రోడ్డును జడ్.పి.చైర్మన్ తో పాటు కలసి ఎం.పి.నామానాగేశ్వర రావు ప్రారంభించారు.

నామా పర్యటన టి.ఆర్.యస్.శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపింది నామాపర్యటించిన ప్రతి గ్రామంలో కార్యకర్తలు డి.జె.నృత్యాలు,బాణా
సంచా పేలుళ్ళతో ఎండను సైతం లెక్క చేయక నామా పై పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

మొత్తం మీద మధిరలో ఎం.పి.నామా నాగేశ్వర రావు పర్యటన టి.ఆర్.యస్.శ్రేణులను ఏకతాటిపైకి తీసుకు
వచ్చింది.ఎం.పి.నామా తో పాటు ఈ పర్యటనలో జడ్.పి.చైర్మన్ లింగాల.కమల్ రాజు,మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు.నాగేశ్వర
రావు,ఎం.పి.పి.మెండెం.లలిత,బొమ్మెర రాం మూర్తి,చెరుకూరి నాగర్జున,మొండితోక సుధాకర రావు,పలువురు జిల్లా, మండల
టి.ఆర్.యస్.నాయకులు పాల్గొన్నారు.

మధిర విచ్చేసిన నామాకు టి.ఆర్.యస్. జిల్లా నాయకులు చెరుకూరి నాగార్జున,మొండితోక సుధాకర రావు,మాదల రామారావు,చిరుమామిళ్ళ రాము,అయితం వెంకటేశ్వర రావులు “ఎం.పి.నామాకు” పుష్ప గుచ్చ్చాలతో ముందుగా మధిరలో ఘన స్వాగతం పలికినారు.
గ్రామాలలో ఎం.పి.నామా పై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకు తున్న ప్రజలు

అను నిత్యం ప్రజల శ్రేయస్సు గురించి తపించే K.C.R గారు. జనం మదిలో C.M. K.C.R.గారు అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలే ఆయన్ను సుదీర్ఘంగా అధికారంలో కొనసాగిస్తున్నాయని తిరిగి తెలంగాణలో మళ్ళీ గెలిచేది T.R.S.పార్టీనే అని T.R.S.లోక్ సభా పక్షనేత,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా.నాగేశ్వర రావు పేర్కొన్నారు.శనివారం నాడు మధిర మండల మరియు మునిసిపాలిటీ పరిధిలో జరిగిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి K.C.R.దార్శనికతతో పల్లెల స్వరూపమే మారిపోయిందని.పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనానికి,పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ నిధుల కొరత లేకుండా చేస్తూ ప్రతి గ్రామంలో రైతు వేదికలు ఏర్పాటు చెయ్యడం,వైకుంఠ ధామాల నిర్మాణం,ప్రకృతి వనాలు,డంపింగ్ యార్డ్ ల ఏర్పాటుతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామాల రూపురేఖలు మారాయని,రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని పల్లెల్లో కూడా L.E.D. బల్బులతో వీధులన్నీ వెలుగుతున్నాయని రైతులకు పెట్టుబడి సాయంతోపాటు రైతు బంధు అందించి రైతులకు అండగా నిలిచింది ఒక్క T.R.S.ప్రభుత్వం మాత్రమేనని అది K.C.R.కే సాధ్యమని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శం గా తీసుకుని అమలు చేయాలని నిర్ణయించు కోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని అన్నారు.మధిర నియోజక వర్గ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని,మధిర నియోజక వర్గం అభివృద్ధి కేవలం T.R.S.తోనే సాధ్యమని మధిర నియోజక వర్గ అభివృద్ధి పనుల కోసం ఎప్పుడయినా తనని కలవ వచ్చని పేర్కొన్నారు.K.C.R.ప్రభుత్వం యొక్క అభివృద్ది సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందేలా చూడాల్సిన భాధ్యత T.R.S.నాయకులు,కార్యకర్తల పై ఉందని అందరూ కలసి మెలసి పనిచేస్తూ రాబోయే కాలంలో జరిగే ఎన్నికలలో T.R.S.పార్టీ గెలుపుకు కృషి చేయాలని తిరిగి K.C.R. ను ముఖ్యమంత్రి ని చేసుకుని రాష్ట్ర అభివృద్ధి లో అందరూ పాలుపంచుకోవాలని నామా.నాగేశ్వర రావు పేర్కొన్నారు.

బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఎం.పి.నామా చిట్ చాట్  దేశం లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామిగా దూసుకు పోతోంది కేంద్రప్రభుత్వ సహకారం లేకున్నా రాష్ట్రం పురోగతి సాధిస్తుంది వ్యవసాయ రంగంలో ముందంజ దీనికి కారణం పుష్కలంగా నీళ్ళు,విద్యుత్ ఉండడమే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలోనే భూములకు రేట్లు ఉండేవి.ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణలో భూముల ధరలు అధికం ఇది K.C.R. క్రెడిట్ ప్రజలు కోరితే థర్డ్ ఫ్రంట్ కు K.C.R.నాయకత్వం వహిస్తారు సిట్టింగ్ M.L.A.లకే దాదాపు పోటీ చేసే అవకాశం,ప్రస్తుత M.L.A.లకు K.C.R.వద్ద ప్రజలలో అనుకూల వాతావరణం ఉంది కాబట్టి తిరిగి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ M.L.A.లకే సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అని నా వ్యక్తిగత అభిప్రాయం
జిల్లాలో అసమ్మతి టీ కప్పులో తుఫాను అధిష్టానం ఆదేశాను సారం అందరూ కలసి పనిచేస్తారు.రాబోయే ఎన్నికల్లో T.R.S.పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

Facebook
Twitter
LinkedIn
Pinterest